గోవిందరావుపేట/వాజేడు: తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నభవన్‌లో ఆదివారం నిర్వహించిన 8వ స్టేట్ లెవల్ షోటోఖాన్ కరాటే చాంపియన్ షిప్ 2026లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గోవిందరాపేట మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన గొంది విగ్నేందర్ ప్రస్తుతం మండల కేంద్రంలోని మెరిట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ కరాటే పోటీల్లో విగ్నేందర్ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించాడు. ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్ రవికిరణ్ విద్యార్థిని సోమవారం అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే వాజేడుకు చెందిన పెనుమళ్లు సీతారామ చంద్రారెడ్డి మండల కేంద్రంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కరాటేలోని స్వారింగ పోటీలో ద్వితీయ, కటాలో మూడో స్థానంలో విజయం సాధించగా ప్రశంసపత్రంతో పాటు మెడల్ అందించారు.


