ఏటూరునాగారం: వేగం కన్నా ప్రాణం మిన్న అని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్ అన్నారు. మండల కేంద్రంలోని వైజంక్షన్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం అరైవ్ అలైన్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించి ఉచితంగా హెల్మెట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత విషయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ ధరించి నిబంధనలను పాటించాలని, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం చేయవద్దన్నారు. మీ ప్రాణం మీ కుటుంబానికి అమూల్యమన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు. హెల్మెట్ ధరించి నిబంధనలను పాటిస్తున్న వారిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఏఎస్పీ మనన్ బట్


