నాకు ఒక్క కొడుకు. హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బాగోగులు పట్టించుకోవడం లేదు. జీవనం సాగించడం ఇబ్బందిగా ఉంది. ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఉన్న ఎకరం భూమి అమ్ముకుందామనుకుంటే అడ్డు తగులుతున్నాడు.
– కొల్లు వెంకట్‌రెడ్డి, గోవిందరావుపేట
ములుగు మున్సిపాలిటీ పరి ధిలోని పాల్‌సాబ్‌పల్లికి చెందిన నిరుపేదలకు ఇళ్లు కేటా యించాలి. తన వార్డులో సు మారుగా 25 కుటుంబాలు సొంత ఇళ్లు లేక దుర్భరజీవి తాలు గడుపుతున్నారు. దీంతో పాటు కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థను సైతం మెరుగుపర్చాలి.
– కొయిల లక్ష్మి,
కౌన్సిలర్ రెండో వార్డు, ములుగు
వెంకటాపురం(ఎం) శివారులో తనకు వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. దానికి సంబంధించి పట్టా అందించాలి. సర్వే నంబర్ 1710/సి/2 లో 20 గుంటల భూమి మా తాత చింతిరెడ్డి బాల్‌రెడ్డి పేరున పట్టా ఉంది. నా తండ్రి మరణించాడు. కావున తన పేరున పట్టా అందించాలి.
– చింతిరెడ్డి దిలీప్‌రెడ్డి, వెంకటాపురం(ఎం)
●


