సండే సందడి | - | Sakshi
Sakshi News home page

సండే సందడి

Mar 2 2026 7:38 AM | Updated on Mar 2 2026 7:38 AM

సండే

సండే సందడి

రామలింగేశ్వరస్వామికి పూజలు

వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్‌ కావడంతో పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించారు.

గోవిందరావుపేట: మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరంలో ఆదివారం పర్యాటకులు సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో లక్నవరం సరస్సుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రకృతి అందాలను చూసి ఆనందంగా గడిపారు. తేలాడే వంతెనపై నడుస్తూ.. సరస్సులో బోటు షికారు చేస్తూ సందడిగా గడిపారు.

సండే సందడి1
1/1

సండే సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement