రామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద అద్భుతంగా ఛత్తీస్‌ఘడ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జు వెంకటేశ్వర్ కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించి రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని కొనియాడారు. అదేవిధంగా అమెరికాకు చెందిన క్రిస్ రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు.
నేడు పదహారు పండుగ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో మహా శివరాత్రి సందర్భంగా శ్రీశుభానంద–ముక్తీశ్వరుల కల్యాణం జరిగి (నేడు)సోమవారం 16 రోజులు అవుతున్న సందర్భంగా పదహారు రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రధాన ఉత్సవ మూర్తుల కల్యాణం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
కాళేశ్వరాలయంలో భక్తుల సందడి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల సందడి నెలకొంది. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతీ అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. శని, కాలసర్పనివారణ పూజలు భక్తులు నిర్వహించారు. దీంతో ఆలయంలో భక్తులు కోలాహలం కనిపించింది.
రామప్ప శిల్పకళ అద్భుతం


