నారసింహుడికి సింహవాహనసేవ
● కోటంచలో కొనసాగుతున్న
బ్రహ్మోత్సవాలు
రేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆది వారం నాలుగో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఉదయం నిత్య విధి పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి సింహవాహన సేవలో మాడవీధుల గుండా ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళల చప్పుళ్లతో ఊరేగించారు. బలిహరణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి గరుడోత్సవం, సదస్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆరగింపు, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్‌రావు, ఆలయ ఈఓ మహేష్, ధర్మకర్తలు, గ్రామపెద్దలు కనుకుంట్ల దేవేందర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నేడు హనుమంతవాహన సేవ
నేడు(సోమవారం) స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చమచార్యులు తెలిపారు. రాత్రి చిన్న రథసేవ, దోపోత్సవం కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు.


