పుచ్చకాయలకు భలే గిరాకీ | - | Sakshi
Sakshi News home page

పుచ్చకాయలకు భలే గిరాకీ

Mar 2 2026 7:38 AM | Updated on Mar 2 2026 7:38 AM

పుచ్చకాయలకు భలే గిరాకీ

పుచ్చకాయలకు భలే గిరాకీ

వాజేడు: వేసవికాలం వచ్చిందంటే చాలు పుచ్చ కాయలకు భలే గిరాకీ ఉంటుంది. మండల కేంద్రంలోని జగన్నాథపురం జంక్షన్‌ వద్ద ఆలుబాక గ్రామానికి చెందిన పలువురు రైతులు పుచ్చకాయలను తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో జగన్నాథపురం, మండపాక, చెరుకూరు, ధర్మవరం తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.

సీపీఆర్‌, డెఫిబ్రిలేషన్‌పై

శిక్షణ

ఎంజీఎం: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన కీలక నైపుణ్యాలపై 33 మంది వైద్యులకు కాకతీయ వైద్య కళాశాలలో సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యఅనిల్‌ తెలిపారు. శని, ఆదివారాల్లో డాక్టర్‌ సూరిశెట్టి శ్రీనివాస్‌, డాక్టర్‌ జ్ఞాపిక సమక్షంలో హృదయం ఆగడం (కార్డియాక్‌ అరెస్టు), సీపీఆర్‌, డిఫిబ్రిలేషన్‌ వినియోగం వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య మాట్లాడుతూ శిక్షణ పొందిన వైద్యులు భవిష్యత్‌లో మరికొంత మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా అత్యవసర వైద్యసేవల నాణ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

రేపు భద్రకాళి

దేవాలయం మూసివేత

హన్మకొండ కల్చరల్‌: చంద్రగ్రహణం సందర్భంగా భద్రకాళి దేవాలయాన్ని మంగళవారం మూసివేయనున్నట్లు ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, వేదపాఠశాల అధ్యాపకుడు తాతాభట్ల నరసింహశర్మ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల వరకు పూజలు నిర్వహించిన అనంతరం 7.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేస్తామని, బుధవారం సంప్రోక్షణపూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తామని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement