జీపీ కార్మికుల వేతనాలు చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్
వెంకటాపురం(ఎం): గ్రామపంచాయతీ కార్మికుల 6 నెలల పెండింగ్ వేతనాలతో పాటు, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని పాలకుర్తి సురేశ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీపీ కార్మికులకు వ్యతిరేకమైన జీవో నంబర్ 51 సవరించడంతో పాటు మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. అనంతరం యూనియన్ మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సురేశ్, ప్రధాన కార్యదర్శిగా ఓదెలు, కోశాధికారిగా స్వామి, ఉపాధ్యక్షుడిగా సాంబయ్య, సత్యపాల్ రెడ్డి, రమేశ్, సహాయ కార్యదర్శులుగా నవాబు, కవిత, రాజయ్య తదితరులను ఎన్నుకున్నారు.


