రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రం
ఏటూరునాగారం/మంగపేట: ప్రజలకు రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుందని ఈ–జిల్లా మేనేజర్ (ఈడీఎం) దేవేందర్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మీసేవా, ఆధార్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. మీసేవలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ తప్పులు లేకుండా నమోదు చేయాలని, ఫార్మర్ రిజిస్ట్రేషన్ సర్వీసును రైతులుందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్ణీత రు సుం కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. యూనివర్సల్ క్‌లైంట్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆ ధార్ సేవలు సులభతరం అయ్యాయన్నారు. మీసే వ నిర్వాహకులు ఈఎస్‌డీ గైడ్‌లైన్స్ ప్రకారం నడిపించాలన్నారు. మీసేవ లోగో, తహసీల్దార్ ఇతర అధికారుల నంబర్లు ప్రజలకు కనిపించేలా ఉండాలన్నారు. కల్యాణలక్ష్మీ, బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. ఈ కా ర్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజ య్, రాకేష్, సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
ఈడీఎం దేవేందర్
మీసేవ కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు


