తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
మంగపేట: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. వేసవి కాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారిగా తాగునీటి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్య ఎదురుకాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో 100 శాతం పన్నులు వసూలు చేయాలన్నారు. ఒకరిద్దరు కార్యదర్శులు పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మందలించారు. సమావేశంలో ఎంపీడీఓ భద్రు, ఎంపీఓ మహేందర్, ఈజీఎస్ ఏపీఓ అంకూస్, కార్యదర్శులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య


