ఫైళ్లు రెడీ.. పైసల్లేవ్
ట్రైకార్, గిరివికాస్, సోలార్ పథకాలకు నిధులు కరువు
ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన ట్రైకార్, గిరివికాస్, సోలార్, స్వయం ఉపాధి పథకాలకు నిధులు కరువయ్యాయి. ఐటీడీఏ పరిధిలోని గిరిజన మండలాల వారీగా అర్హులైన గిరిజనులు గిరివికాసం కింద 324 మంది, ట్రైకార్ ద్వారా రాజీవ్ యువవికాసం కింద 613, సోలార్ పథకం కింద 521 మంది అర్హులను గుర్తించి ఫైల్ రెడీ చేసి ఉంచారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఐటీడీఏకు సరైన బడ్జెట్ రాకపోవడంతో పైళ్లు మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా యి. ఐటీడీఏ పీఓకు సూపర్ పవర్స్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడంతో ప థకాలు అమలుకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది.
బడ్జెట్ కేటాయింపులో అలసత్వం
గతంలో ఐటీడీఏకు నేరుగా నిధులు వచ్చేవి. కానీ మూడేళ్ల నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. పథకానికి కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసి ఐటీడీఏ పీఓ పరిశీలించి కలెక్టర్‌కు ఫైల్ పుటప్ చేయగా అక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేసిన అనంతరం హైదరాబాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్‌కు ఫైల్ వెళ్తుంది. కానీ అర్హుల జాబితాకు కావాల్సిన బడ్జెట్‌ను ప్రభుత్వ ఆర్థిక కమిషన్ నుంచి మంజూరును ట్రైబల్ వెల్ఫేర్‌కు జీఓ జారీ చేయాల్సి ఉంది. కానీ ఫైనాన్స్ కమిషన్ ట్రైబల్ వెల్ఫేర్‌కు ఈ పథకాలకు కావాల్సిన డబ్బులను ఇవ్వడం లేదు. దీంతో అ లబ్ధిదారుల ఫైళ్లను అలాగే హోల్డ్ చేసి పెట్టారు.
నిర్మాణాలకే పెద్దపీట
ఐటీడీఏ ద్వారా ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద రూ.39.5 కోట్లు మంజూరు కాగా వాటి ద్వారా ఆశ్రమ పాఠశాలల్లో నూతన భవనాల నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ పనులు ఈ ఏడాది మార్చి 31 వరకు పూర్తి చేయాలనే నిబంధనలు ఉన్నాయి. దీంతో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు వేగంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ, ఇంజనీరింగ్ శాఖ ద్వారా గిరిజన విద్యాలయాలు, ప్రహరీలు, ఇతర భవన నిర్మాణాల మరమ్మతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏకు నిధులు కేటాయిస్తూ వస్తుంది. దానివల్ల కేవలం మరమ్మతులు, నిర్మాణాల పనులు మాత్రమే సాగుతున్నాయి. గిరిజన రైతులకు అందించాల్సిన పథకాలను మాత్రం పక్కన పెట్టడంతో రైతులు నిరాశ పడుతున్నారు.
మంగపేట : ములుగు నియోజక వర్గంలోని అర్హులైన గిరిజనులందరికీ ఏటూరునాగారం ఐటీడీఏ ద్వారా ట్రైకార్ రుణాలను మంజూరు చేయాలని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్‌ను తెలంగాణ రాష్ట్ర ఉపాధిహామీ మండలి(టీఎస్‌ఈజీసీ)సభ్యుడు గుమ్మడి సోమయ్య కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని ట్రైకార్ కార్యాలయంలో చైర్మన్ బెల్లయ్యనాయక్‌ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో ఎక్కువగా నిరుపేద గిరిజన కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. వారిలో అర్హులైన వారందరికీ ట్రైకార్ ద్వారా రుణాలు అందించి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరినట్లు సోమయ్య తెలిపారు.
ఐటీడీఏకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల అమలుకు నిధులు కేటాయించాలి. సోలార్, గిరివికాసం, రాజీవ్ యువవికాసం, ఇతర పథకాలకు బడ్జెట్‌ను కేటాయించి అర్హులైన వారికి నేరుగా నిధులు అందించేలా చూడాలి. నిధులు రాకపోవడంతో గిరిజనులకు సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయి. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి నిధులు మంజూరు చేయాలి.
– చందా మహేశ్, ఏటూరునాగారం. ఆదివాసీ నాయకుడు
●
మూడేళ్లుగా ఎదురుచూస్తున్న
గిరిజనులు
మరమ్మతులు, నిర్మాణ పనులకే బడ్జెట్
ఫైళ్లు రెడీ.. పైసల్లేవ్
ఫైళ్లు రెడీ.. పైసల్లేవ్
ఫైళ్లు రెడీ.. పైసల్లేవ్
ఫైళ్లు రెడీ.. పైసల్లేవ్


