క్రీడాకారులను అభినందించిన ఎస్పీ
ములుగు రూరల్: ఇటీవల సైబరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ పోలీసుల క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించగా ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ వారిని బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన పోలీసులు పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన అమిత్‌కుమార్ సింగ్, మేకల నాగరాజులను ఆయన అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని కోరారు.
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్‌పీ తిప్పనబోయిన రామకృష్ణ ప్రకృతిని గౌరవిస్తూ వృక్షపూజ నిర్వహించారు. బుధవారం పాఠశాలలో సాంఘికశాస్త్ర పాఠ్యబోధనలో భాగంగా విద్యార్థులకు ప్రకృతిలో చెట్ల గొప్పతనాన్ని వివరించారు. పర్యావరణానికి హాని తలపెట్టడం చాలా బాధాకరమైన విషయమన్నారు. మానవాళికి, పక్షులకు, జంతువులకు, జీవరాసులకు కేంద్రమైన చెట్లు ఎంతో మేలు చేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఫోరం అధ్యక్షుడు కమలాకర్, ఆర్‌పీలు ఏడుకొండలు, నాగేశ్వర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని హనుమకొండలో గల ఫ్రీ ఎగ్జామ్‌నేషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్‌గా సారయ్యదొరను నియమిస్తూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పీజీ హెడ్మాస్టర్ అయిన సారయ్య దొరను నియమించడంతో పాటు పీఈటీసీలో శిక్షణ ఇచ్చి పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేలా చూడాలని సూచించారు. గతంలో పనిచేసిన శ్రీరాములు ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో సారయ్యదొరను నియమించారు.
ములుగు: ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత, భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రెండు కొత్త పథకాల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను హరిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం ప్రభుత్వ ఉద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా పథకం అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం, కుటుంబ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పింస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ చైర్మన్ మడుగూరి నాగేశ్వరరావు, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్, ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జనగాం బాబురావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నవరం రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులను అభినందించిన ఎస్పీ
క్రీడాకారులను అభినందించిన ఎస్పీ
క్రీడాకారులను అభినందించిన ఎస్పీ


