‘పది’ పరీక్షల నిర్వహణలో అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షల నిర్వహణలో అప్రమత్తం

Feb 26 2026 7:28 AM | Updated on Feb 26 2026 7:28 AM

‘పది’ పరీక్షల నిర్వహణలో అప్రమత్తం

‘పది’ పరీక్షల నిర్వహణలో అప్రమత్తం

ములుగు: వచ్చే నెల 14వ తేదీ నుంచి పదోతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు విధుల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థరెడ్డి మాట్లాడారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలను ముందస్తుగా సందర్శించి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. పదో తరగతి పరీక్షలకు మొదటిసారిగా క్లాక్‌ రూమ్‌ నిర్వహణ ప్రవేశపెట్టినందున విద్యార్థుల వస్తువులు బ్యాగులు ఏమైనా ఉంటే క్లాక్‌ రూమ్‌ వద్ద భద్రపరచుటకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎసీజీఈ కన్నం వినోద్‌కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement