అర్జీలు పరిష్కరించండి..
● గ్రీవెన్స్, గిరిజన దర్బార్‌లో
అధికారులను వేడుకున్న బాధితులు
● ప్రజావాణిలో 51, గిరిజన దర్బార్‌లో
14 వినతులు
● స్వీకరించిన కలెక్టర్ దివాకర,
పీఓ చిత్రామిశ్రా
● పరిశీలించి పరిష్కరించాలని
అధికారులకు ఆదేశం
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాధితులు అర్జీలు అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 51 వినతులు రాగా కలెక్టర్ దివాకర స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించిన ఆయన సత్వరమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుంచి 14 వినతులు రాగా పీఓ చిత్రామిశ్రా స్వీకరించారు.
ప్రజావాణిలో
వచ్చిన
ఫిర్యాదులు
ఇతర శాఖలకు సంబంధించి 16
భూ సమస్యలు 15
ఇందిరమ్మ ఇళ్లు 7
ములుగు మండలం మదనపల్లికి చెందిన ఓ గిరిజనుడు తన తండ్రి ఉద్యోగం కారుణ్య నియామక కింద ఇప్పించాలని విన్నవించారు. జిల్లా కేంద్రంలో గిరిజనేతరులు ఆక్రమించుకున్న ములుగు గ్రామకంఠం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ నాయకులు విన్నవించారు. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంలో పనిచేస్తున్న సీఆర్‌టీల వేతనాలు ఇవ్వాలని కోరారు. గంగారం మండలం మడగూడెంలో విద్యుదాఘాతానికి కాలిపోయిన బాధితుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పీఓను కోరారు. ఏటూరునాగారం మండలం రాంపూర్ ఆగ్రహార్‌లో గిరిజనులకు పట్టాలు ఉన్నాయని కానీ రైతు భరోసా రావడం లేదని రైతులు మొరపెట్టుకున్నారు. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములను ఆన్‌లైన్ చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు విన్నవించారు. వెంకటాపురం(కె) మండలం బోదాపురం పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని, భవనం మంజూరు చేయాలని కోరారు. ములుగు మండలంలోని పొట్లాపురంలో ఉన్న పోడు భూములకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని గిరిజన రైతులు కోరారు. 2026 మేడారం జాతరలో 834 మంది వలంటీర్లకు భోజన వసతి కల్పించిన బిల్లు ఇప్పించాలని ఆదివాసీ నంఘం నాయకులు పీఓకు విన్నవించారు. ములుగు మండలం పొట్లాపురంలో సబ్సిడీపై ట్రాక్టర్ ఇప్పించాలని రైతులు పీఓను కోరారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ జనార్ధన్, ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్‌బాబు, మేనేజర్ శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు పరిష్కరించండి..


