ప్రతిపాదనలు సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

వీసీలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌

సెక్రటరీ శైలజారామయ్యర్‌

ములుగు: గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్ల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజారామయ్యర్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి గోదావరి నది తీరం ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి నది తీరంలో జరగనున్న పుష్కరాల ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో నివేదికలు తయారు చేసి సమర్పించాలన్నారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యశిబిరాలు, గజ ఈతగాళ్ల ఏర్పాటు, బందోబస్తుతో పాటు ఇతర పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పుష్కరాలు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో మంగపేట, ముళ్లకట్ట, రామన్నగూడెం, కన్నాయిగూడెంలో పుష్కర ఘాట్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రతీ పుష్కర ఘాట్‌ వద్ద భక్తులకు తాగునీరు మరుగుదొడ్లు, పార్కింగ్‌, విద్యుద్దీపాల ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement