ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
ఏటూరునాగారం: గిరిజన, సాంఘిక, మైనార్టీ, బీసీ సంక్షేమశాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏటూరునాగారం మండలంలోని రెండు సెంటర్లలో మొత్తం 601 మంది పరీక్షలు రాసేందుకు హాజరుకావాల్సి ఉండగా 23 మంది గైర్హాజరైనట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. ఆకులవారి ఘనపురం క్రాస్‌రోడ్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 231 మంది, స్పోర్ట్స్ స్కూల్ కేంద్రంలో 347 మంది పరీక్షలు రాసేందుకు హాజరైనట్లు తెలిపారు.


