‘ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’
వెంకటాపుం(కె): మౌలిక వసతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలను ఎస్‌ఎఫ్‌ఐ బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మరుగుదొడ్లు, విదద్యుత్ సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వద్ద నుంచి వేల రూపాయల ఫీజలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రజకులపై దాడి అమానుషం
భూపాలపల్లి రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మండలంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రజకులపై జరిగిన దాడి అమానుషమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అవమానించడం, దాడి చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రణయ్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌటం సురేందర్, జిల్లా కార్యదర్శి మోటాపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు ఏదునూరి స్వామి పాల్గొన్నారు.
కోటగుళ్లను సందర్శించిన ఇంగ్లండ్ దేశస్తులు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను ఆదివారం ఇంగ్లండ్ దేశానికి చెందిన సిమన్, వాలేరి సందర్శించారు. రామప్ప గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ ఆలయ విశిష్టతను వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు ఆలయ శిల్పసంపద అద్భుతంగా ఉందన్నారు. వారి కెమెరాలలో శిల్ప సంపదను బంధించుకున్నారు.
మెడల్స్ సాధించడంపై
హర్షం
మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెడల్స్ సాధించడం పట్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమ్మయ్య హర్షం వ్యక్తంచేశారు. హనుమకొండ జవహర్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–16 షాట్‌ఫుట్‌లో జిల్లాకు చెందిన సమన్విత గోల్డ్ మెడల్స్, అన్విత 18 లాంగ్‌జంప్‌లో సిల్వర్ మెడల్, పలు విభాగాల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు వారు ఆదివారం మెమొంటోలు, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. స్టేట్ సెక్రటరీ సారంగపాణి మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
‘ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’
‘ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’


