పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలం యాపలగడ్డలో మార్చి 4నుంచి 7వ తేదీ వరకు అర్రెం వంశస్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలని మేడారం జాతర మాజీ చైర్మన్ అర్రెం లచ్చుపటేల్ కోరారు. మేడారం జాతర చైర్‌పర్సన్ ఇర్ప సుకన్య, మేడారం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి, సర్పంచ్ కల్తి కృష్ణవేణి, అర్రెం వంశీయులతో కలిసి పగిడిద్దరాజు జాతర పోస్టర్‌ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్రెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు జాతరను నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్కను, పలువురు ప్రజాప్రతినిధులను జాతరకు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. భక్తుల భారీగా తరలివచ్చి జాతరను విజవయంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్రెం వంశస్తులు అప్పయ్య, లక్ష్మినర్సు, నాగయ్య, బుచ్చయ్య, సమ్మయ్య, కాంతారావు, తాడ్వాయి మాజీ సర్పంచ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.


