దేవాదుల ప్రాజెక్టు
న్యూస్‌రీల్
– 8లోu
ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
హాట్‌టాపిక్‌గా
విహారయాత్రకు ముఖ్యమంత్రి, మంత్రులు..
● దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని రేవంత్‌రెడ్డి
● మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటనతో నిద్రలేచిన ప్రభుత్వం
● బీఆర్‌ఎస్ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే
పెద్ది సుదర్శన్ రెడ్డి
సాక్షిప్రతినిధి, వరంగల్ :
జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి వరంగల్ ఆయకట్టుకు కీలకమైన ప్రాజెక్టులో దేవాదుల పంపుహౌస్ మోటార్లు పనిచేయకపోవడం వివాదాస్పదంగా మారింది. గత యాసంగి సీజన్‌లో మోటార్లు మొరాయించాయి. ఫలితంగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక ఎండిపోయాయని రైతుల పక్షాన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్‌ఎస్ పార్టీ అధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు దేవన్నపేట పంపుహౌస్‌ను హుటాహుటీన సందర్శించారు. మోటార్లు రన్ అయ్యే వరకు అక్కడే ఉంటామని ప్రకటించినా ఆ వెంటనే మోటార్లు ఆన్ కాలేదు. మోటార్లలో సాంకేతిక కారణాలు తలెత్తాయన్న అధికారులు.. ఆ తర్వాత రెండింటిని ఆన్‌చేయగా యాసంగి సీజన్ దాటే సమయానికి నీళ్లందాయి. ఈ సీజన్‌లోనూ దేవన్నపేట పంపుహౌస్‌లో మోటార్లు ఆన్ చేయకపోవడంతో శుక్రవారం సందర్శించిన మాజీ మంత్రి హరీశ్‌రావు బృందం... కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి, గోదావరిలో సరిపడా నీళ్లున్నా దేవాదుల ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే దేవన్నపేట పంపుహౌజ్‌లో నీటిపారుదలశాఖ అధికారులు శనివారం మోటార్‌ను ఆన్‌చేశారు. అక్కడి నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించేందుకు పంపు ఆన్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్...
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 2.15 గంటలకు మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చేరుకుంటారు. 2.45 గంటలకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు అక్కడినుంచి బయలుదేరి దేవాదుల ప్రాజెక్టుకు 3.30 గంటలకు చేరుకుంటారు. 5 గంటల వరకు ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో తిరుగు పయనమై హైదరాబాద్ చేరుకుంటారు. శనివారం రాత్రి నుంచి పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం, మంత్రుల పర్యటనతో ఒరిగేదేమి లేదు
సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రుల పర్యటనతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒరిగేదేమీ లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. రెండు సంవత్సరాల్లో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటన తర్వాత నిద్రలేచిన ప్రభుత్వం హుటాహుటిన పంపుహౌస్‌లో మోటార్‌ను ఆన్ చేశారని అన్నారు. రైతులకు సాగునీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.
ప్రాజెక్టు పంపుహౌస్‌లకు నేతల తాకిడి
నిన్న బీఆర్‌ఎస్ నేత హరీశ్,
మాజీ ఎమ్మెల్యేల బృందం
నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక..
గంగారం వద్ద పనుల పరిశీలన
అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష
ఎట్టకేలకు ఒక మోటార్‌ను ఆన్ చేసిన అధికారులు
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
ములుగు/ఏటూరునాగారం: నేటి సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు శనివారం అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులు, జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి దేవాదుల ప్రాజెక్ట్ పరిశీలన పర్యటన సందర్భంగా ప్రాజెక్ట్ ఆవరణలో అధికారుల సమావేశ ప్రాంతంతో పాటు హెలిపాడ్, గోదావరి నది వ్యూ పాయింట్‌ను పరిశీలించారు.
పనులపై ఆరా
దేవాదుల మొదటి దశ పనులను 2008 మార్చి 14న యూపీఏ చైర్‌ర్సన్ సోనియాగాంధీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019లో తుపాకులగూడెం బ్యారేజ్‌ను 59 గేట్లతో నిర్మించింది. అలాగే ప్రాంతాల్లోని రిజ ర్వాయర్లకు నీటిని సరఫరా చేసేందుకు పైపులైన్‌లను అధికారులు నిర్మించారు. ఇలా దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు మొదటి, రెండో, మూడో దశ పనులు చేపట్టారు. మూడో దశలోని పనులు పూర్తి కాకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి వివరాలపై ఆరా తీయనున్నారు.
స్థానికులకు దక్కని చుక్కనీరు
జిల్లాలో 110 కిలోమీటర్ల గోదావరి ప్రవహించినప్పటికీ స్థానికులకు తాగు, సాగునీరు అందడం లేదు. బ్యారేజ్‌లు, ఇన్‌టెక్ వెల్ ఉన్నా రైతులకు ఒరిగింది ఏమిలేదని మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సాగు, తాగునీరు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
దేవాదుల ప్రాజెక్టు
దేవాదుల ప్రాజెక్టు
దేవాదుల ప్రాజెక్టు


