మంగళసూత్రాలు అందజేత | - | Sakshi
Sakshi News home page

మంగళసూత్రాలు అందజేత

Feb 22 2026 8:22 AM | Updated on Feb 22 2026 8:22 AM

మంగళసూత్రాలు అందజేత

మంగళసూత్రాలు అందజేత

మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామికి ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్‌ సాయి విజయ్‌ చౌహాన్‌ బహుకరించిన 30.876 గ్రాముల బంగారు మంగళ సూత్రాలు, 60 గ్రాముల వెండి గొలుసులను రిటైర్డ్‌ ఆలయ అర్చకులు కై కర్యం రాఘవాచార్యులు శనివారం ఆలయ కార్యనిర్వహణ అధికారి మహేశ్‌కు అందజేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4,75,775 ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ముక్కాముల రాజశేఖర్‌శర్మ, అర్చకులు ఈశ్వర్‌చంద్‌ రామానుజమ్‌ దాస్‌, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్‌ సురేశ్‌, భక్తులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement