క్షేత్రపర్యటనలు విద్యావికాసానికి దోహదం
ములుగు రూరల్: క్షేత్రపర్యటన విద్యార్థుల విద్యావికాసానికి దోహదపడతాయని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేషం అన్నారు. శుక్రవారం వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఇకో క్లబ్ ఆధ్వర్యంలో కళాశాల బాటనీ, జువాలజీ విద్యార్థులు ప ర్యటించారు. వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ ఉమారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త శకుంతల విద్యార్థులకు వ్యవసాయ పరిశోధన ప్రాధాన్యం, ఆధునిక సాంకేతిక పద్ధతులపై వివరించారు. వర్మీ కంపోస్టు వినియోగం, తయారీ విధానాలపై అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం, నేల సారవంతంగా తయారు చేయడం, అధిక దిగుబడులు సాధించడంపై విద్యార్థులతో చర్చించారు. ఇకో క్లబ్ కన్వీనర్, బాటనీ ఇన్‌చార్జ్ సరిత, జువాలజీ ఇన్‌చార్జ్ అనికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.


