రామప్పలో అటవీశాఖ అధికారులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 41 మంది అటవీశాఖ అధికారులు డీసీఎఫ్‌వో గంగారెడ్డి ఆధ్వర్యంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువుతో పాటు పాలంపేట గ్రామ శివారులోని కేన్ మొక్కలను సందర్శించారు.


