ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి
శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఆరె కులస్తులు
ములుగు రూరల్: ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్‌గౌస్‌పల్లిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆరె కులస్తులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పసుల కార్తీక్ మాట్లాడుతూ శివాజీ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘు, సంఘం నాయకులు తిప్పారపు కిషన్‌రావు, యువరాజు, కుడుతల రమేష్, సుధాకర్, ఆగయ్య, వంశీ, శశీ, రఘు తదితరులు పాల్గొన్నారు.


