ఆలయ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఆలయ అభివృద్ధికి కృషి

Feb 20 2026 6:44 AM | Updated on Feb 20 2026 6:44 AM

ఆలయ అభివృద్ధికి కృషి

ఆలయ అభివృద్ధికి కృషి

రేగొండ: కొడవటంచ ఆలయ అభివృద్ధి కోసం నూతనంగా ఏర్పాటైన ఉత్సవ కమిటీ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలంలోని కొడవటంచ ఆలయ ప్రాంగణంలో 14 మంది ధర్మకర్తల ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ చైర్మన్‌గా నాయినేని సంపత్‌రావును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేవా లయాలు ఆధ్యాత్మికతకు నిలయాలే కాకుండా సమాజానికి సాంస్కృతిక కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధ ంగా నూతన కమిటీ కృషి చేయాలని పేర్కొన్నారు.

ప్రముఖుల హాజరు..

కొడవటంచ ఆలయంలో పున:ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు వేద పండితులు పతిష్టాయాగారంభం, జలధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు దంపతులు, వరంగల్‌ మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, ఉమ్మడి వరంగల్‌ మాజీ జెడ్పీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్‌ నాయినేని సంపత్‌ రావు, ఆలయ ఈఓ మహేష్‌, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ నడిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement