గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ములుగు రూరల్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవించదర్ అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని పత్తిపల్లి, దేవగిరిపట్నం, అనంపల్లి గ్రామస్తులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం జంగాలపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, కూనూరు అశోక్‌గౌడ్, జగన్నాధచారి, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్


