పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధి
ప్రజలకు సేవకురాలిగా పనిచేసి చూపిస్తా
ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ
ములుగు: రాజకీయాలు ఎన్నికలు ముగిసేవరకు మాత్రమే.. మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించి గెలిపించిన ప్రజలకు సేవకురాలిగా పనిచేస్తూ, పార్టీలకతీతంగా ములుగు పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతినిప్పుల చంద్రకళ వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి చైర్‌పర్సన్‌గా ఎన్నికై న ఆమె మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మిస్తా..
ములుగు పట్టణంలో ప్రధానంగా రోడ్లు, డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. చిన్నపాటి వర్షానికే మురుగు, వర్షపునీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతుంది. మంత్రి సీతక్క సహకారంతో డ్రెయినేజీ సమస్యను పరిష్కరించేందుకు ఏజెన్సీ వాళ్లతో డిజైన్ చేయించి మాస్టర్‌ప్లాన్‌తో ముందుకెళ్తా.
అభివృద్ధిలో ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లకు భాగస్వామ్యం..
రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే. పట్టణాభివృద్ధిలో ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లను భాగస్వాములు చేస్తాం. మాది, మీది అనే తేడా లేకుండా అన్ని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో మమేకం అవుతాం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తా.
తాగునీటి వసతికి తొలి ప్రాధాన్యం..
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సహకారంతో ములుగు పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. మున్సిపల్, పీఆర్ శాఖ పరిధిలో రూ.49 కోట్ల నిధులు మంజూరై ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి వసతికి తొలి ప్రాధాన్యత ఇస్తా.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించేలా కృషి చేస్తా. ప్రభుత్వానికి, పేద ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను వారికి చేరవేయడమే లక్ష్యం. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందేలా చూస్తా.
సమస్యల పరిష్కారానికి మాస్టర్‌ప్లాన్
ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ
కూడళ్లను సుందరీకరిస్తాం..
ములుగు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటా. అంతర్గత రోడ్లను విస్తరిస్తూ ప్రధాన కూడళ్లల్లో సుందరీకరణ పనులు చేపడతాను. మాపై విశ్వాసంతో గెలిపించిన పట్టణవాసుల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తూ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా.
పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధి


