గ్రామాలాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర | - | Sakshi
Sakshi News home page

గ్రామాలాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర

Feb 18 2026 7:06 AM | Updated on Feb 18 2026 7:06 AM

గ్రామ

గ్రామాలాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర

గ్రామాలాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర

ములుగు: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో నూతనంగా ఎన్నికై న ములుగు, వెంకటాపురం(ఎం), మల్లంపల్లి, గోవిందరావుపేట మండలాల పరిధిలోని సర్పంచ్‌లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీపీల నిర్వహణకు ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచుల పాత్ర కీలకమన్నారు. నూతన సర్పంచులకు పంచాయతీ రాజ్‌ చట్టంపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని, పాలకులుగా ఉంటూ సేవకులుగా ప్రజలకు సేవ చేయాలన్నారు. గ్రామాల్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులు ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని సూచించారు, గ్రామాల అభివృద్ధిపై పాలక మండలి ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించాలని, ఉపాధి హామీ పథకంలో కార్మికుల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జీపీల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనే అంశాలపై ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్‌ తయారీ, తడి, పొడి చెత్త నిర్వహణ స్టాల్‌ను మంత్రి సీతక్క పరిశీలించారు. అనంతరం ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు మంత్రి సీతక్క కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణి, డీపీఓ వెంకయ్య, ఆత్మ కమిటీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలో మంత్రి సీతక్క మంగళవారం పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. జాతర ముగిసినా అమ్మవార్ల దర్శనానికి వస్తున్న భక్తులు ఇబ్బందులు పడకుండా చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. అనంతరం ఆలయం వద్ద ఇప్పపూల లడ్డూలు విక్రయిస్తున్న మహిళలతో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వనదేవతలను దర్శించుకుని సీతక్క పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కల్యాణి, గ్రంథాలయ చైర్మన్‌ రవిచందర్‌, డీసీసీ అధ్యక్షుడు అశోక్‌, మేడారం సర్పంచ్‌ భారతి తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీల నిర్వహణకు రూ.500 కోట్లు మంజూరు

4 మండలాల సర్పంచ్‌లకు

5 రోజుల పాటు శిక్షణ

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

ధనసరి సీతక్క

గ్రామాలాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర1
1/1

గ్రామాలాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement