విద్యుత్‌ అంతరాయానికి సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అంతరాయానికి సహకరించాలి

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

విద్య

విద్యుత్‌ అంతరాయానికి సహకరించాలి

అంతర్జాతీయ సదస్సుకు డీవైఎస్‌ఓ అమ్మవారికి పూజలు నకిలీ ఎలక్ట్రికల్‌ వైర్ల పట్టివేత

ములుగు రూరల్‌: విద్యుత్‌ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఏఈ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు(గురువారం) జిల్లా కేంద్రంలోని పత్తిపల్లిరోడ్డు, మున్సిపల్‌ ఆఫీస్‌ రోడ్డులో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ లైన్‌ మరమ్మతుల కారణంగా అంతరాయం కలుగుతుందని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

ఎస్సై రాజ్‌కుమార్‌ బదిలీ

ఏటూరునాగారం: ఏటూరునాగారం ఎస్సై రాజ్‌కుమార్‌ హైదరాబాద్‌ ఇంటెలిజెన్స్‌కు బదిలీ అయ్యారు. 2025 జూన్‌ 13న వాజేడు పోలీస్‌స్టేషన్‌ నుంచి ఏటూరునాగారం ఎస్సైగా ఆయన బదిలీపై వచ్చారు. ఈ పోలీస్‌స్టేషన్‌లో అతి తక్కువ కాలం ఆయన పనిచేసి రికార్డులోకి ఎక్కారు. ఇప్పటి వరకు స్టేషన్‌లో ఎస్సై ఎవరు వచ్చినా రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించేవారు. ఏటూరునాగారం ఎస్సైగా ఇంకా ఎవరిని నియమించలేదు.

రామప్పలో

విదేశీయుల సందడి

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం సింగపూర్‌, అమెరికా, జపాన్‌ దేశాలకు చెందిన మేరి, జాన్‌ బోమెన్‌, యోహీ మోబర్ల్‌ సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని కొనియాడారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అంతర్జాతీయ సదస్సుకు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌ ఎంపికయ్యారు. కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌, ఎన్‌ఐటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవికుమార్‌ వద్ద ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేస్తున్న అశోక్‌కుమార్‌ సదస్సులో శ్రీది లైఫ్‌ అండ్‌ అచీవ్‌మెంట్‌ ఆఫ్‌ ఠాకూర్‌ దేవ్‌ సింగ్‌శ్రీ అంశంపై పేపర్‌ ప్రజెంటేషన్‌ చేయనున్నారు. ఈసందర్భంగా అశోక్‌కుమార్‌ను గైడ్‌ రవికుమార్‌, ఒలింపిక్స్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్‌ఖాన్‌, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, కోచ్‌లు అభినందించారు.

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి అమ్మవారిని బుధవారం తెలంగాణ జ్యువెల్లరీ వెరిఫికేషన్‌ అధికారి, బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కట్టా అంజనీదేవి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు అలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. అదేవిధంగా మహాశిరాత్రిని పురస్కరించుకుని వరంగల్‌కు చెందిన న్యాయవాది చిదంబరనాథ్‌శర్మ దంపతుల ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు నిర్వహించే మహారుద్రయాగాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు.

వరంగల్‌ క్రైం: అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భవన నిర్మాణ రంగంలో వాడే బ్రాండెడ్‌ గోల్డ్‌ మెడల్‌ కంపెనీని పోలిన నకిలీ వైర్లు విక్రయిస్తున్నాడో వ్యాపారి. పక్కా సమాచారంతో డబ్బాల సమీపంలోని అర్భుద ఎలక్ట్రికల్స్‌ అండ్‌ శానిటరీలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, హనుమకొండ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. రూ.3.59 లక్షల నకిలీ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు. షాప్‌ యజమాని కంతి లాల్‌ అరెస్ట్‌ చేసి తదుపరి విచారణ నిమిత్తం హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

విద్యుత్‌ అంతరాయానికి సహకరించాలి
1
1/3

విద్యుత్‌ అంతరాయానికి సహకరించాలి

విద్యుత్‌ అంతరాయానికి సహకరించాలి
2
2/3

విద్యుత్‌ అంతరాయానికి సహకరించాలి

విద్యుత్‌ అంతరాయానికి సహకరించాలి
3
3/3

విద్యుత్‌ అంతరాయానికి సహకరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement