కాళేశ్వరంలో తెప్పోత్సవానికి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంలో తెప్పోత్సవానికి ఏర్పాట్లు

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

కాళేశ్వరంలో తెప్పోత్సవానికి ఏర్పాట్లు

కాళేశ్వరంలో తెప్పోత్సవానికి ఏర్పాట్లు

కాళేశ్వరంలో తెప్పోత్సవానికి ఏర్పాట్లు

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో మహా శివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమంలోని సరస్వతీఘాటులో తెప్పోత్సవం నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం నుంచి తీసుకువచ్చిన తెప్పకు సంబంధించిన సామగ్రితో హంస ఆకృతిని తయారు చేస్తున్నారు. తెప్పను 45 డ్రమ్ముల నుంచి 60 డ్రమ్ముల వరకు సుమారు 40 మంది కూర్చుని ప్రయాణించే విధంగా కూలీలు తయారు చేస్తున్నారు. దీనికి ఒక మోటార్‌ పడవను అమర్చనున్నారు. మహాశివరాత్రి (ఆదివారం) రోజు రాత్రి 7 గంటలకు విశేష పూజలతో ఉత్సవమూర్తులను జలవిహారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement