వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరి
వెంకటాపురం(కె): బాలింతలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కోరం క్రాంతికుమార్ అన్నారు. మండల పరిధిలోని నూగూరు సబ్‌సెంటర్‌లో జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సబ్ సెంటర్‌ను సందర్శించి మాట్లాడారు. కుష్ఠు వ్యాధి నివారణపై రేపటి(శుక్రవారం) వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యాధి గ్రస్తులు ఉంటే సకాలంలో వైద్యశాలకు తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాఘవులు, స్వరూప, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్


