బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
ములుగు రూరల్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు మంగళవారం జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నికై న సందర్భంగా జాతీయ రహదారిపై సంబురాలు జరుపుకుని జాతీయ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో కార్యకర్తస్థాయి నుంచి జాతీయ అధ్యక్ష స్థాయికి ఎదగడం బీజేపీ అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనన్నారు. నతిన్ నబిన్ నాలుగు సార్లు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని వివరించారు. జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, భూక్య జవహార్‌లాల్, రవింద్రాచారి, నగరపు రమేష్, శోభన్, రాజ్‌కుమార్, విశ్వనాధ్, రాకేష్‌యాదవ్, కుమార్, రవిరెడ్డి, నాగరాజు, వెంకట్‌రెడ్డి, కవిరాజు, సంపత్, రాజశేఖర్, రవిందర్, సతీష్, శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు బలరాం


