మేడారంలో సింగరేణి సేవలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా నుంచి మేడారం సమ్మక్క–సారలరమ్మ జాతరలో విధులు నిర్వహించేందుకు సింగరేణి రెస్క్యూ, లైఫ్ సేవర్ స్విమ్మింగ్ టీం సభ్యులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. పదిరోజుల పాటు మేడారంలో సేవలు అందించనున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి రెస్క్యూ, స్విమ్మింగ్ టీం సభ్యులకు పచ్చ జెండా ఊపి ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించారు. గద్దెల వద్ద విధులు నిర్వహించే సమయంలో చక్కటి క్రమశిక్షణ, గౌరవం, పూర్తి సేఫ్టీతో పని చేయాలని సూచించారు. అధికారుల సూచనలను పాటిస్తూ విధులు నిర్వహించి సింగరేణి పేరును నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, శ్యాంసుందర్, పూర్ణచందర్, రెస్క్యూ, స్విమ్మింగ్ సభ్యులు పాల్గొన్నారు.


