భర్తీ ఎప్పుడో?
సిబ్బంది పై అదనపు భారం
ఖాళీలు.. చిన్నారుల
వివరాలు ఇలా..
నివేదికలు ప్రభుత్వానికి అందించాం
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఫ్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చింది. ఈ మేరకు 1 నుంచి 3వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను కొనసాగించడంతో పాటు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసింది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలలో టీచర్లు, ఆయాల కొరత కారణంగా చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటపాటలతో కూడిన విద్య అందని ద్రాక్షలా మారింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు లేని కేంద్రాలకు అందుబాటులో ఉన్న టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆశించిన స్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు విద్య అందించడం కష్టంగా మారింది. ఇటీవల ప్రభుత్వం 65 సంవత్సరాలు నిండిన ఆయాలను, టీచర్లను విధుల నుంచి తొలగించడంతో సమస్య అధికమవుతోంది.
నాలుగు ప్రాజెక్టులు
జిల్లాలోని పది మండలాల పరిధిలో ములుగు, ఎస్‌ఎస్ తాడ్వాయి, ఏటూరుగారం, వెంకటాపురం(కె), ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలాలను నాలుగు ప్రాజెక్టులుగా విభజించారు. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 640 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలలో మొత్తం 95 టీచర్ పోస్టులు, 319 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ స్థానాలు ఖాళీల కారణంగా కేంద్రాల పర్యవేక్షణ కరువవుతుంది.
అంగన్‌వాడీ కేంద్రాలలో పూర్తి స్థాయిలో టీచర్లు, ఆయాలు లేని కారణంగా ఉన్న సిబ్బందిపై అధిక భారం పడుతుంది. ఈ క్రమంలో సిబ్బందిలేని అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కన ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో టీచర్లు రెండు కేంద్రాలలో చిన్నారులకు విద్యను అందించడం, ఆయాలు రెండు కేంద్రాలలో పౌష్టికాహారం అందించడం సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. గర్భిణులు, బాలింతలకు పూర్తిస్థాయిలో అంగన్‌వాడీ సేవలు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేస్తే విద్య అందే అవకాశం ఉంది.
జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 640 కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 545 మంది టీచర్లు విధుల్లో ఉండగా 95 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయాలు 321 మంది ఉండగా 319 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చిన్నారులు 15,023, మూడేళ్లలోపు పిల్లలు 8,235, ఐదేళ్ల లోపు పిల్లలు 6,788, గర్భిణులు 1,767, బాలింతలు 1,573 ఉన్నారు.
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత
95 టీచర్, 319 ఆయా పోస్టులు ఖాళీ
ఉన్నవారిపైనే పనిభారం
అంగన్‌వాడీ కేంద్రాల్లోని టీచర్లు, ఆయాల ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేధిక అందించాం. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేవిధంగా పక్క సెంటర్ల టీచర్లకు బాధ్యతలు అప్పగించాం. అంగన్‌వాడీ కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ చేస్తున్నాం.
– తుల రవి, జిల్లా సంక్షేమాధికారి
భర్తీ ఎప్పుడో?


