గట్టమ్మతల్లికి మొక్కులు
ములుగు రూరల్: ఆదిదేవత గట్టమ్మ తల్లికి మేడారం భక్తులు మొక్కులు చెల్లించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి బయలుదేరిన భక్తులు మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. భక్తులు అమ్మవారికి పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దెలకు పసుపు–కుంకుమ సమర్పించారు. అనంతరం మేడారం బయలుదేరి వెళ్లారు.
ములుగు రూరల్: మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా మొబైల్ ఏటీఎం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆదివారం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో గట్టమ్మ ఆలయం వద్ద మొబైల్ ఏటీఎంను బ్యాంక్ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో గట్టమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులు అవసరాల నిమిత్తం మొబైల్ ఏటీఎంను వినియోగించారు.
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ, నందీశ్వరుని విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని శేషాద్రి కొనియాడారు.
ములుగు రూరల్: జిల్లాలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన వజ్జ నిఖిల్‌కుమార్ టాటా ముంబై మారథాన్ పోటీలో ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన మారథాన్‌లో 42 కిలో మీటర్ల దూరాన్ని 4.58 గంటలలో పూర్తి చేసి కల సాకారం చేసుకున్నాడు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా ముంబై మారథాన్‌లో నిఖిల్ ప్రతిభ చాటడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
గట్టమ్మతల్లికి మొక్కులు
గట్టమ్మతల్లికి మొక్కులు
గట్టమ్మతల్లికి మొక్కులు


