రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ ములుగు
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రస్థాయి 11వ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (సబ్–జూనియర్) పోటీలు ఆది వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించారు. ఆది లాబాద్ ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షిషా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. సాయంత్రం ము గింపు కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై క్రీడాకారులకు బహుమతులు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూ ల నర్సయ్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజా రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, డీవైఎస్‌ఎస్‌ఓ శ్రీనివాస్, డీటీఎస్‌ఎస్‌ఓ పార్థసారథి, నాయకులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
అండర్–8 బాలుర విభాగంలో 10 పాయింట్లతో జగిత్యాల, బాలికల విభాగంలో 8 పాయింట్లతో కామారెడ్డిలు విజేతలుగా నిలిచాయి. అండర్ 10 బాలుర విభాగంలో 6 పాయింట్లతో సంయుక్తంగా ములుగు, మంచిర్యాల జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో 8 పాయింట్లతో ములుగు, మహబూబాబాద్ జిల్లాలు సంయుక్త విజేతలుగా సత్తా చాటాయి. అండర్–12 బాలుర విభాగంలో 7 పాయింట్లతో ఆదిలాబాద్, బాలికల విభాగంలో 8 పాయింట్లతో నారాయణపేట చాంపియన్‌షిప్ సాధించాయి. అండర్–14 బాలుర విభాగంలో 8 పాయింట్లతో వనపర్తి, బాలికల విభాగంలో 10 పాయింట్లతో హనుమకొండ గెలుపొందాయి. ఇక 19 పాయింట్లతో అన్ని విభాగాల్లో కలిసి ములుగు ఓవరాల్ చాంపియన్ షిప్ కై వసం చేసుకుంది.
ఆదిలాబాద్‌లో ముగిసిన
సబ్ జూనియర్ పోటీలు


