జోరుగా అభివృద్ధి పనులు
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: గత కొన్నేళ్ల క్రితం పచ్చని చెట్లు, అడవి ప్రాంతంగా ఉన్న మేడారంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం గద్దెల పునర్నిర్మాణం పనులతో పాటు మేడారంలోని దారులన్నీ విస్తరించింది. దారుల్లో డివైడర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళ మేడారం దారులన్నీ విద్యుత్ కాంతులతో విరాజిమ్ముతున్నాయి. అంతేకాకుండా గద్దెల ప్రాంగణంలో హైమాస్ట్ లైటింగ్ సామర్ధ్యం కలిగిన వాటికంటే ఎక్కువ సామర్ధ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేయడంతో తల్లుల గద్దెల ప్రాంగణం విద్యుత్ కాంతులతో వెలుగొందుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి మేడారానికి వచ్చిన సందర్భంగా పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టడంతో మేడారంలో నూతన శోభ సంతరించుకుంది.


