టెంట్ సిటీ.. లగ్జరీ టెంట్లు
ఏటూరునాగారం: మహాజాతరకు వచ్చే భక్తులు బస చేసేందుకు మేడారం పోలీస్ క్వార్టర్స్ పక్కనే లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేశారు. దానికి టెంట్ సిటీగా నామకరణం చేశారు. అయితే ఈ నెల 18, 19వ తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన ఉండడంతో వాటిని మరింత అత్యాధునికంగా రూపొందించారు. టెంట్‌లను ప్రభుత్వం రెండు రోజుల పాటు అద్దెకు తీసుకొని మేడారం వచ్చే మంత్రులకు ఇందులో సకల ఏర్పాట్లు చేయనుంది. మంత్రులు, వీవీఐపీలు, ఇతర అధికారులు సైతం ఇక్కడ విశ్రాంతి తీసుకోవడంతో పాటు పడుకునేందుకు సౌకర్యాలను కల్పించారు. సీఎం పర్యటన తర్వాత ఆన్‌లైన్‌లో టెంట్‌లను అద్దెకు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.


