పరిశుభ్రతతోనే ఆరోగ్యానికి మేలు
జనసంద్రం
● తల్లులను దర్శించుకున్న 5 లక్షల మంది
● వనమంతా భక్తుల సందడి
● కలెక్టర్ దివాకర టీఎస్
తల్లుల గద్దెల వద్ద కిక్కిరిసిన భక్తజనం
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం వచ్చే భక్తులు అమ్మవార్ల దర్శనంతో పాటు పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యానికి మేలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం మేడారంలో పర్యటించి జాతర పనులను పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా చేపట్టనున్న ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శుభ్రతతో కూడిన జీవనం పవిత్రతకు మార్గమని, ఆ పవిత్రతే దైవత్వానికి సమీపమని సూచించారు. మేడారంలో ప్రతీ ఒక్క భక్తుడు పరిశుభ్రత పాటించాలని, దీనిని నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలన్నారు.
మేడారం
పరిశుభ్రతతోనే ఆరోగ్యానికి మేలు
పరిశుభ్రతతోనే ఆరోగ్యానికి మేలు


