భయం భయంగా బైపాస్‌రోడ్డు
● వాహనాల రద్దీకి ఎగసిపడుతున్న దుమ్ము
● పాత జాతరను గుర్తుకు చేస్తున్న
గట్టమ్మ రోడ్డు
ఏటూరునాగారం: వరంగల్ నుంచి గట్టమ్మ మీదుగా మేడారం జాతరకు వెళ్లే భక్తులకు కొత్తగా ఏర్పాటు చేస్తున్న బైపాస్ రోడ్డు పాత జాతరను గుర్తుకు తెస్తుంది. మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మ దగ్గర మొక్కులు చెల్లించుకునేందుకు తమ వాహనాల నిలిపి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. గత రెండు జాతర నుంచి గట్టమ్మ దేవాలయం వద్ద పక్కకు ఏర్పాటు చేసిన పార్కింగ్‌లోనే వాహనాలను నిలిపేవారు. ప్రస్తుతం వాహనాలు సంఖ్య గణనీయంగా పెరగడంతో గట్టమ్మ దేవాలయానికి ముందుగా బైపాస్ రోడ్డును సుమారు కిలోమీటర్ వరకు ఏర్పాటు చేసి గుట్ట దిగువన పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం వాహనాలను డైరెక్ట్‌గా వెళ్లకుండా పోలీసులు ఆపి గట్టమ్మ బైపాస్ నుంచి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల గట్టమ్మ బైపాస్ ప్రస్తుతం మెటల్ రోడ్డుతోనే ఉండడంతో దుమ్ము ఎగసిపడుతోంది. దీంతో ముందు వెళ్లే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
వాటర్ స్ప్రేయింగ్ చేయించాలి..
బీటీ రోడ్డు వేసే వరకు మెటల్ రోడ్డుపై వాటర్ స్ప్రె యింగ్ చేయించాలని భక్తులు కోరుతున్నారు. డైరెక్ట్‌గా వెళ్లే వాహనదారులను గట్టమ్మ వద్ద నిలపకుండా పంపించాలని వాహనదారులు కోరుతున్నారు. కంకర రోడ్డు కావడంతో దుమ్ము ఎగిసిపడడంతో వెనుక వచ్చే వాహనాలకు రోడ్డు క నిపించే పరిస్థితి లేకుండా పోతుంది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌జాం అవుతుంది.
భయం భయంగా బైపాస్‌రోడ్డు


