మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
● ఏఎస్పీ మనన్ బట్
ఏటూరునాగారం: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మద్దేడు పీఎస్ పరిధిలోని కడియం పాండు అలియాస్ కార్తీక్, ముచకి మంగళ్ అనే వ్యక్తులు లొంగిపోయినట్లు తెలిపారు. ఇద్దరు పార్టీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలవడంతో వారికి సరెండర్ పాలసీ కింద రూ. 25 వేల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీ సంక్షేమ కోసం చేపట్టిన పోరు క న్నా ఊరు మిన్న... మన ఊరికి తిరిగిరండి అనే నినాదంలో భాగంగా సీఆర్‌పీ ఆధ్వర్యంలో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారన్నారు. మావోయి స్టు పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో కింది స్థాయి క్యాండర్ నాయకత్వంపై అసంతృప్తితో రహ స్య జీవితం వదిలి కుటుంబాలతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని మావోలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో పదుల సంఖ్యలో లొంగిపోతున్నట్లు తెలిపారు.


