ఆదిదేవతకు మొక్కులు
ములుగు రూరల్: మేడారం మహాజాతర సందర్భంగా వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్ల దర్శనానికి బయలుదేరారు. శుక్రవారం ఆదిదేవత గట్టమ్మ తల్లికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కుల చెల్లించారు. పసుపు, కుంకుమతో పాటు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. దీంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఉదయం 9 గంటల సమయంలో గట్టమ్మ ఆలయానికి చేరుకునే భక్తుల వాహనాలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. సుమారు గంట పాటు భక్తులు ఇబ్బందులు పాడ్డారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. అయితే గట్టమ్మ వద్ద విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి అవగాహన లేకపోవడంతోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.


