గోవు సకల దేవతా స్వరూపం
హన్మకొండ కల్చరల్: గోవు సకల దేవతాస్వరూపమని, వేదాలు, పురాణ సాహిత్యంలోనూ చెప్పబడిందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం వేయిస్తంభాల దేవాలయంలో గోపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో గోవును నూతన వస్త్రంతో అలంకరించి శ్రీసూక్తవిధానంతో పూజలు చేశారు. శనగపిండి, బెల్లం, బియ్యం, పండ్లు నైవేద్యంగా సమర్పించారు. హారతి, నీరాజన మంత్రపుష్పం చేశారు. భక్తులు గోమాత చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్, పరి చారకులు సందీప్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.


