మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
ములుగు: మున్సిపాలిటీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం బుధవారం అధికారులు రిజర్వేషన్లు ప్రకటించారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 13,963 మంది ఓటర్లు ఉన్నారు. 6,661 మంది పురుషులు, 7,300 మంది మహిళలు ఇద్దరు ఇతరులు ఉన్నారు. 20 వార్డులలో రెండు ఎస్టీలకు(ఎస్టీ జనరల్ ఒకటి, ఎస్టీ మహిళ ఒకటి) కేటాయించగా ఎస్సీ జనరల్‌కు మూడు సీట్లను(ఎస్సీ జనరల్‌కు రెండు, ఎస్సీ మహిళ ఒకటి) కేటాయించారు. అలాగే బీసీలకు ఐదు సీట్లు (బీసీ జనరల్ మూడు, బీసీ మహిళ రెండు) కేటాయించారు. అలాగే జనరల్ మహిళకు ఆరు, అన్ రిజర్వుడు నాలుగు స్థానాలు ఉన్నాయి. 20 వార్డులలో 10 వార్డులను మహిళలకు కేటాయించారు.


