బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేయాలి
ములుగు రూరల్: మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మండల పరిధిలోని మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాఉతూ మహాజాతరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వాహనాల రాకపోకలకు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాతర రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు(బుధవారం) భోగి పండుగ సందర్భంగా గోదాదేవి రంగనాథుల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్యాణ వేడుకలను పురస్కరించుని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ముస్తాబు చేశారు. ఆలయం ఎదుట ఉన్న తులసి వనాలను ముస్తాబు చేశారు. ఉదయం 10.31 గంటలకు కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
మంగపేట: మండల పరిధిలోని మంగపేట, కమలాపురం, రాజుపేట తదితర గ్రామాల్లోని పలు షాపుల్లో అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి మాచర్ల కోటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని గాలి పటాలను విక్రయించే పలు ఫ్యాన్సీ, కిరాణం, జనరల్ స్టోర్‌లలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా అమ్మకాలు ఏమైనా విక్రయిస్తున్నారా అని పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మకర సంక్రాంతి పండుగను ఎకో ఫ్లెండ్లీగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఓ రవి, శ్రీలత, ప్రశాంత్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీ అభినవ వీరభద్ర స్వామి– భద్రకాళి అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని నేడు(బుధవారం) ఉదయం 11.20 గంటలకు కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బురుగుపల్లి మఠం గంగాధర్, కోనుగంటి రాజ్‌కుమార్‌లు తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని శివాలయం నుంచి వీరభద్రుడు–భద్రకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను మంగళవారం డప్పుచప్పుళ్లతో ట్రాక్టర్‌లో ఊరేగింపుగా వీరభద్రుడి ఆలయానికి తీసుకెళ్లారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున రథానికి స్వాగతం పలుకుతూ నీళ్లు ఆరబోశారు.
బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేయాలి
బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేయాలి
బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేయాలి


