నేటినుంచి మహాజాతర పూజలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర పూజా కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు(బుధవారం) మేడారం, కన్నెపల్లిలో గుడిమెలిగె పండుగను పూజారులు సంప్రదాయంగా నిర్వహించనున్నారు. పూజారులు అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించనున్నారు. పూజారులు ఉదయాన్నే తలస్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరంచి గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహించేందుకు ప్రత్యేకంగా సమావేశమై కార్యక్రమాలకు సంబంధించిన పూజ సామగ్రిని సిద్దం చేశారు. గుడిమెలిగె పండుగ అనంతరం వారం రోజుల తర్వాత మండమెలిగె పండుగను నిర్వహించనున్నట్లు వివరించారు. గుడిమెలిగె పండుగతో అమ్మవార్లకు మహాజాతర పూజా కార్యక్రమాలు ఆరంభం కానున్నాయి.
మేడారం, కన్నెపల్లిలో గుడిమెలిగె పండుగ


