వైద్యశిబిరాల ఏర్పాటు పనులు పూర్తిచేయాలి
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు ముందస్తుగా వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేయనున్న 10 ఉచిత వైద్య శిబిరాలు, క్యాంపుల ఏర్పాటుకు త్వరగా పనులు పూర్తి చేయాలని మేడారం మహాజాతర ఉప సమన్వయ అధికారి, హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మేడారంలో పర్యటించి ఉచిత వైద్య శిబిరాలు చేసే స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ స్థలాల చదును, టెంట్ల ఏర్పాటు పనులు త్వరగా చేయాలన్నారు. అలాగే టీం సభ్యులు సరిపడా మందులు సమకూర్చుకోవాలని సూచించారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి శిబిరానికి వస్తున్న రోగుల వివరాలు, రిఫరల్ కేసులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్ కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి పవన్‌కుమార్, కాటాపూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి రంజిత్, డెమో సంపత్, ఏఎంఓ దుర్గారావు, ఆరోగ్య విస్తరణ అధికారి సమ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ గణేశ్, డీపీఎంఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
మహాజాతర ఉప సమన్వయ అధికారి అప్పయ్య


