పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల
ములుగు: ములుగు మున్సిపాలిటీకి చెందిన 20 పోలింగ్ కేంద్రాల జాబితాను మున్సిపల్ కమిషనర్ జనగాం సంపత్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాల జాబితాను మున్సిపాలిటీ కార్యాలయ గోడలపై అంటించారు. 1వ వార్డు పోలింగ్ స్టేషన్ జీవింతరావుపల్లి ప్రభుత్వ పాఠశాలలో, 2, 3, 4, 19, 20వ వార్డుకు చెందిన పోలింగ్ స్టేషన్లు ములుగు జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్‌లో, 5, 6, 7వ వార్డు ములుగు ప్రైమరీ స్కూల్‌లో, 8, 9, 14వ వార్డుకు చెందిన పోలింగ్ స్టేషన్లు ములుగు జెడ్పీహెచ్‌ఎస్ గర్‌ల్స్ స్కూల్‌లో 10, 11వ వార్డు బండారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో, 12, 13వ వార్డు జెడ్పీహెచ్‌ఎస్ బండారుపల్లిలో, 15, 16, 17, 18వ వార్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. 20 వార్డులకు 20 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా 13,963 మంది ఓటర్లకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో దాదాపుగా 698 మంది ఓటు వేసేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.


