ఓటర్లు 13,963
వార్డుల వారీగా ఓటర్ల వివరాలు
మున్సిపాలిటీ తుది ఓటరు జాబితా విడుదల
ములుగు: మున్సిపాలిటీ అధికారులు ఎన్నికల తుది ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేసి ప్రదర్శించారు. ములుగు పట్టణంతో పాటు బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామాలను కలుపుకొని 2024 ఫిబ్రవరి 2న ములుగు మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో 13,963 మంది ఓటర్లతో జాబితాను ప్రకటించారు. ఇందులో పురుషులు 6,661 మంది, మహిళలు 7,300 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నా రు. మున్సిపాలిటీగా ఆవిర్భవించిన ములుగులో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
మున్సిపాలిటీలో 20 వార్డులు
ములుగు మున్సిపాలిటీలో ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. జనవరి 20వ తేదీ లోగా నోటిఫికేషన్ రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం మున్సిపాలిటీల పరంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో సోమవారం తుది ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ములుగు పట్టణంలో 20 వార్డులకు గాను 20 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. జనవరి 1న అధికారులు 14,112 మందితో ఓటర్ల జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాల పరిష్కారం తర్వాత 149 ఓటర్లను తొలగించి 13,963 మందితో తుది జాబితా విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 వేల జనాభా ఉండగా 1,844 మంది ఎస్టీలు, 2,470 మంది ఎస్సీలు ఉండగా మిగిలిన జనాభాలో బీసీ, ఓసీలు ఉన్నారు.
వార్డు పురుషులు మహిళలు ఇతరులు
1 321 350 0
2 333 404 1
3 342 410 0
4 380 393 0
5 299 355 0
6 315 312 0
7 371 364 0
8 355 342 0
9 329 366 0
10 350 395 1
11 344 367 0
12 381 409 0
13 326 362 0
14 354 402 0
15 380 379 0
16 291 325 0
17 312 317 0
18 293 345 0
19 277 337 0
20 308 366 0
పురుషులు 6,661.. మహిళలు 7,300
తొలిసారిగా ములుగు మున్సిపాలిటీలో ఎన్నికలు
రిజర్వేషన్లపై
ఆశావహుల్లో ఉత్కంఠ
చైర్మన్ పీఠంపై పార్టీల నజర్
ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగనుండడంతో చైర్మన్ పదవిని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. ములుగు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ కావడంతో చైర్మన్ పదవి ఎస్టీ రిజర్వేషన్ వస్తుందా.. లేదా జనాభా ఆధారంగా ఎస్సీ, బీసీలకు కేటాయిస్తారా అని ఉత్కంఠతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ సిద్ధమవుతుండగా, పట్టణంలో ఎలాగైన తమ పార్టీ జెండాను ఎగురవేసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి.
ఓటర్లు 13,963


