రామప్ప హుండీ ఆదాయం రూ.6,71,954
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించగా రూ.6,71,954ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ కుమారస్వామి సమక్షంలో హుండీ కానుకలను శ్రీవల్లి సేవా సమితి సభ్యులు లెక్కించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, సర్పంచ్ చల్లగోండ రాజు, రామప్ప ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ, అర్చకుడు ఉమాశంకర్, టూరిజం గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్‌లు పాల్గొన్నారు.
ములుగు రూరల్: విద్యుత్ వినియోగదారులు ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఆనందం అన్నారు. ఈ మేరకు సోమవారం ఉచిత విద్యుత్ వినియోగదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు. వ్యవసాయ రైతులకు సైతం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. జిల్లాలో గృహజ్యోతి పథకంలో 40,855 మంది, వ్యవసాయ విద్యుత్ వినియోగంలో 25,427 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈ నాగేశ్వర్‌రావు, ఏఈ రవి, లైన్ ఇన్‌స్పెక్టర్లు జహీర్ తదితరులు పాల్గొన్నారు.
వాజేడు: అడవుల సంరక్షణ అందరి బాధ్యతని ఎఫ్‌ఎస్‌ఓలు నాగమణి, భిక్షపతి అన్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని పూసూరు, కృష్ణాపురం గ్రామాల్లో సోమవారం అడవులతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అడవులతో మానవాళికి ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. అడవులకు నిప్పు పెడితే చెట్లతో పాటు జంతువులు మృత్యువాత పడుతాయని తెలిపారు. అనంతరం యువకులకు వాలీబాల్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి పూసూరు, కృష్ణాపురం సర్పంచ్‌లు దబ్బగట్ల సుమన్, పూనెం విజయ్‌బాబులు బహుమతులు ప్రదానం చేశారు.
ములుగు: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వయోవృద్ధుల కొరకు ఏర్పాటు చేసిన ప్రణమ్ డే కేర్ సెంటర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి తుల రవి, ములుగు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ వైస్ చైర్మన్ శ్రీనివాస్, కోశాధికారి సతీష్, కార్యదర్శి రమేష్, నాగరాజు, జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు ఐలయ్యలు రిబ్బన్ కట్ చేసి కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ డే కేర్ సెంటర్ వయోవృద్ధుల ఉల్లాసానికి, క్రీడా కార్యక్రమాలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ నాగేంద్ర, ఎఫ్‌ఆర్‌ఓ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
రేపు గోదారంగనాయకస్వామి కల్యాణం
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రేపు ఉదయం 10 గంటలకు శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు.
రామప్ప హుండీ ఆదాయం రూ.6,71,954
రామప్ప హుండీ ఆదాయం రూ.6,71,954
రామప్ప హుండీ ఆదాయం రూ.6,71,954


