‘సీఎం పర్యటనను విజయవంతం చేయండి’
ములుగు రూరల్: ఈ నెల 18న మేడారం రానున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్ అన్నారు. మండల పరిధిలోని మల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం మేడారం వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, నాయకులు బొక్క సత్తిరెడ్డి, వెంకన్న, వాకిడి రామకృష్ణారెడ్డి, మల్లంపల్లి సర్పంచ్ శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.
ములుగు రూరల్: జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు మండలంలోని రాయినిగూడెం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాలలో సోమవారం విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈరులాల్ అభినందించారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఈ నెల 7 వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించిన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ మేరకు పాఠశాలకు చెందిన తరుణ్, మహేశ్‌లు హెల్త్ అండ్ హైజెనిక్ అనే అంశంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 18న జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు జిల్లా నుంచి పాల్గొననున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ ఈరులాల్, గైడ్ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘సీఎం పర్యటనను విజయవంతం చేయండి’


